KCR logo
KCR logo
ewedw

శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు పర్యాటక, సాంస్కృతిక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం

ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించబోతున్న దివంగత ప్రధానమంత్రి , తెలంగాణ ముద్దుబిడ్డ, స్వర్గీయ PV నరసింహ రావు గారి స్వగ్రామం వంగర, లక్నేపల్లి లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయటానికి రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు పర్యాటక, సాంస్కృతిక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం హైదరాబాద్ లో రవీంద్రభారతి లోని తన కార్యాలయంలో నిర్వహించారు. వంగర, లక్నేపల్లి లలో సహచర మంత్రులు శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు గారు, శ్రీమతి సత్యవతి రాథోడ్ గార్లు, PV కుటుంబ సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి వారి సలహా, సూచనల మేరకు టూరిజం, కల్చరల్ శాఖ అధికారులు కన్సల్టేంట్ ల ద్వారా రూపొందించిన ప్రాజెక్టు రిపోర్ట్ పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ.. గౌరవ CM కేసీఆర్ గారి ఆలోచన విధానాల ప్రకారంగా స్వర్గీయ పి వి నరసింహ రావు గారి స్మారక కేంద్రం ప్రతిష్ట్మాతక పర్యాటక కేంద్రంగా ఉండాలని అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.

వంగర, లక్నేపల్లి లలో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించబోతున్న టూరిజం ప్రాజెక్టులను కన్సల్టెంట్ లు రూపొంచిన డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి పరిశీలించారు. కన్సల్టెంట్ లు రూపొందించిన ప్రాజెక్టు రిపోర్ట్ లను మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి సమర్పించి, వారి సూచనలు, సలహాల ప్రకారం గా తదుపరి చర్యలు చేపడుతామన్నారు .

ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ MD మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, కన్సల్టెంట్ లు తదితరులు పాల్గొన్నారు.