KCR logo
KCR logo
ewedw

“వేయి పడగల మేధావి” అన్న పుస్తకాన్ని కమిటీ సభ్యుల సమక్షంలో కేశవరావు గారు ఆవిష్కరించారు

భారతజాతి ఖ్యాతిని దశదిశలా చాటిన పరిపాలనాదక్షుడు, రాజకీయ నిపుణుడు, గొప్ప సాహితీమూర్తి మన పి.వీ. నరసింహారావు అని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కె. కేశవరావు అన్నారు.
పివి నరసింహారావు శత జయంతి వేడుకలను పురస్కరించుకుని రవీంద్రభారతిలోని కళాభవన్ లో ఈరోజు ఉదయం 11 గంటలకు కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిటీ అధ్యక్షులు, ఎంపి. కె.కేశవరావుగారితో తో పాటు కమిటీ సభ్యులు కె.వి.రమణాచారి గారు, కె.రామచంద్రమూర్తి గారు, దేవులపల్లి ప్రభాకర్ రావు, పి.వి.కుటుంబ సభ్యులు పి వి సురభి వాణిదేవి, పి.వి.ప్రభాకర్ రావు, పివి చంద్రశేఖర రావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు వెల్జాల చంద్రశేఖర రావు రాసిన “వేయి పడగల మేధావి” అన్న పుస్తకాన్ని కమిటీ సభ్యుల సమక్షంలో కేశవరావు గారు ఆవిష్కరించారు. పివి శత జయంతి నాటికి హైదరాబాదుతో పాటు ఢిల్లీ, వరంగల్ , కరీంనగర్ లాంటి ఐదు ప్రధాన నగరాలలో పీవీ నరసింహారావు విగ్రహాలు ప్రతిష్టించేలా కమిటీ సభ్యులు కార్యాచరణ రూపొందించామన్నారు. వీటితోపాటు పివి గారిపై ఎంపిక చేసిన పుస్తకాల ప్రచురణకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు.