సీ ॥ శ్రీవాణి తనలోన స్థిరముగా కొలువయిగర్భంబు నందునే గడిపె నేమొ !ఆ బృహస్పతి తానె యావహించిన క్షణమందునే జననంబు నందె నేమొ !శ్రీకృష్ణ పరమాత్మ జీవమై నిలుచుండపురిటినొప్పుల తోడఁ బుట్టె నేమొ !బ్రహ్మయే తనచేతి వ్రాతలన్ మార్చగామారు రూపంబునన్ బంపె నేమొ !
తే॥గీ॥ వాక్కు , బుద్ధియు, చతురత, భవిత దిద్దునేర్పు లొక్కటై వచ్చిన నేత యౌటనిజము నిజమిది నరసింహుఁడీ జగానమహిత కారణ జన్ముండు మరువలేము !
ఏక కాలమునందు స్వీకరించిరెంటికిన్ న్యాయంబు నొంటిగా జేసినఘనుఁడు కదా ! పీవి తెనుఁగు ఠీవి !యువకునిలో రేగెడుడుకు రక్తము దనన్స్వాతంత్య్ర పోరాట సమర మునకుపరుగులు వెట్టించ పదములు గలిపెనువ్యాసముల్ వ్రాసె నుద్యమము పైన
తే॥గీ॥ ఒక్క ప్రక్క నిజాముని నక్క జిత్తులొక్క ప్రక్క తెల్లదొరల లెక్కలేనియట్టి దమనకాండ మనసు నగ్ని రేపెసింహమయ్యెను మన నరసింహ మపుడు !
సీ॥ బలములేని ప్రభుత్వ పగ్గాలు చేఁబట్టిఊపిరిలూదిన యుత్తముండుఅధికార పార్టీకి నండయై నిలచినధీరుఁడీతఁడు మహా దిగ్గజుండుదిగజారిపోవు నార్థిక పరిస్థితిఁజూచిగాడిని పెట్టిన వాడితండుఅపరచాణక్యుడై యధికారమును పూర్తిఅయిదేండ్లు నిల్పిన యట్టి ఘనుఁడుఆ॥వె॥ క్షీర సాగరంబు చిల్కగ నానాడుతొట్ట దొలుత విషము బుట్టినట్లుపీఠ మెక్కిన వెనువెంట వైషమ్యముల్బుట్టె నయిన ఁదాని నెట్టినాడు
డా॥ వూసల రజనీగంగాధర్పీవీ స్మారక లెజండరీ పురస్కార గ్రహీత9290680605